శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం స్వాగ్. హసిత్‌గోలి దర్శకత్వం. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ సింగరో సింగ ను విడుదల చేశారు. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ పాటను నిక్లేష్ సుంకోజీ రచించారు. బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఆలపించారు. ఈ పాట ద్వారా హీరో పాత్రను పరిచయం చేశారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీవిష్ణు గత చిత్రాల తరహాలోనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వింజమర వంశ మహారాణి రుక్మిణి దేవి పాత్రలో కథానాయిక రీతూ వర్మ కనిపించనుంది. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు చిత్ర తారాగణం.