సంయుక్తమీనన్ మరో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ-2: తాండవం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ హిట్ అఖండ కు సీక్వెల్ ఇది. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో సంయుక్తమీనన్ కథానాయికగా ఖరారైంది. కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.