Namaste NRI

అమెరికాలో తొలిసారి … న్యూయార్క్‌లో

ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అమెరికాలో తొలిసారి న్యూయార్క్‌లో రద్దీ చార్జీల పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ఆ నగరంలో ఎంతో రద్దీగా ఉండే ప్రఖ్యాత ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌, టైమ్స్‌ స్కేర్‌, వాల్‌ స్ట్రీట్‌ లాంటి ప్రాంతాల్లో ప్రవేశించే వాహన చోదకులు పీక్‌ అవర్స్‌లో రోజుకు 9 డాలర్లు (దాదాపు రూ.772) వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద ట్రక్కులు, టూరిస్టు బస్సులాంటి ఇతర వాహనదారుల నుంచి ఆఫ్‌-పీక్‌ అవర్స్‌లో 2.25 డాలర్ల నుంచి 21.60 డాలర్ల (రూ.193 నుంచి రూ.1,853) వరకు చార్జీలు వసూలు చేస్తారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ సహా ఎంతో మంది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నెలలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఆ పథకాన్ని రద్దు చేస్తానని ట్రంప్‌ ప్రకటించారు. ఎన్నో రాజకీయ వివాదాలు, న్యాయపరమైన అడ్డంకుల తర్వాత కార్యరూపం దాల్చిన ఈ పథకాన్ని రెండేండ్ల క్రితం న్యూయార్క్‌ గవర్నర్‌ కాథే హొచుల్‌ ప్రతిపాదించారు.  ట్యాక్సీ డ్రైవర్ల సంఘాలు, వ్యాపారులు, పాదచారులు సహా అనేక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ పథకానికి పలు సవరణలు చేయాల్సి వచ్చింది. దీంతో న్యూయార్క్‌ ప్రభుత్వం పొరుగునే ఉన్న న్యూజెర్సీ కోర్టును ఆశ్రయించింది. కానీ, ఆ ప్రయత్నం విఫలమవడంతో రద్దీ చార్జీల పథకం అమలుకు మార్గం సుగమమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress