Namaste NRI

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నల్లజాతీయురాలిని సుప్రీం కోర్టు జడ్జిగా నామినేట్‌ చేయనున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచారు. ప్రస్తుతం యూఎస్‌ సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న స్టీఫెన్‌ బ్రేయర్‌ జూన్‌లో పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలో స్టీఫెన్‌ బ్రేయర్‌ స్థానంలో సుప్రీం కోర్టు జడ్జిగా నల్లజాతీయురాలిని నామినేట్‌ చేస్తానని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే వారికి అసాధారణమైన విద్యార్హతలు ఉండాలి. న్యాయస్థానంలో మంచి అనుభవంతో పాటు నిజాయితీ ఉండాలి.  వీటితోపాటే మంచి క్యారెక్టర్‌ ఉండాలన్నారు. నామినేట్‌ చేయబోయే మహిళకు ఇవన్నీ ఉండనున్నాయి అని పేర్కొన్నారు. తాను నామినేట్‌ చేయబోయే మహిళ పేరును మాత్రం బయటపెట్టలేదు.

Social Share Spread Message

Latest News