Skip to main content

Namaste NRI

ప్రధాని నరేంద్రమోదీని కలిసిన విదేశాంగ మంత్రులు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరైన బ్రిక్స్‌ విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్కొక్కరుగా వచ్చి వేదికపై ఉన్న ప్రధానిని కలిసి కరచాలనం చేశారు. అతనంతరం అందరు కలిసి ప్రధానితో గ్రూప్‌ ఫొటో దిగారు.

బ్రిక్స్‌ విదేశాంగ మత్రుల సమావేశానికి ముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలతో కూడా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events