Namaste NRI

శర్వానంద్‌ జోడీగా మాజీ మిస్‌ ఇండియా?

మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి తెలుగులో భారీ ఆఫర్లొస్తున్నట్లు వినికిడి. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్‌ తో కలిసి ఆమె ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో జార్జ్‌ క్రిష్‌ పేరుతో ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా మానస వారణాసిని కంఫర్మ్‌ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలోని కథానాయిక పాత్ర కోసం అనంతిక సనీల్‌కుమార్‌, రుక్మిణి వసంత్‌, మమితాబైజు పేర్లు మొన్నటివరకూ వినిపించాయి. చిత్రబృందం చివరకు మానస వారణాసి వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events