తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో బాలీవుడ్ బ్యూటీ అడుగుపెట్టబోతున్నది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రం రూపొందనుంది. యథార్థ సంఘటన ఆధారంగా, వైమానిక దళం నేపథ్యంలో సాగే కథ ఇది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఎంపికైనట్లు సమాచారం. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. పృథ్వీరాజ్ సినిమతో బాలీవుడ్‌కి పరిచయమైన ఆమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.














