బీజేపీ సీనియర్ నేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లఖ్‌నపూలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రి, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. కల్యాణ్ సింగ్ 1932 జనవరి 5న తేజ్‌పాల్ సింగ్ లోధి. సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు.
1957లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచాకర్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఫ్‌ులో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఫ్‌ు తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరపున బరిలో నిలిచి గెలిచారు. ఈ క్రమంలో 1977`79 యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కూడా ఆయన పని చేశారు.
కల్యాణ్ సింగ్ మృతికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాతో పాటు యూపీ సీఎం యోగీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.