Namaste NRI

 త్వరలో భారత్‌తో ఎఫ్‌టీఏ ఒప్పందం : రిషి సునాక్‌

 భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌ తెలిపారు. యూకే పార్లమెంట్‌ దిగువ సభలో రిషి మాట్లాడారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు.  ఇండోనేషియాలో జీ`20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడిరచారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని  ప్రతిపక్ష లేబర్‌ పార్టీతో పాటు అధికార కన్జర్వేటివ్‌ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడనని, ఈ విషయంలో భారత్‌`యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.

Social Share Spread Message

Latest News