భారత్, అమెరికాకు బలమైన భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. భారత్ లాంఛనంగా జి`20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బైడెన్ స్పందించారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని అన్నారు. అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో జి`20 సారథ్యం వహిస్తున్న భారత్‌కు పూర్తి మద్దతు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.














