Namaste NRI

తంగలాన్‌లో గంగమ్మ ఫస్ట్‌లుక్‌ విడుదల

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా తంగలాన్‌. చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మమైన సినిమా ఇది. పా.రంజిత్‌ దర్శకుడు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ కథానాయికలు. పా.రంజిత్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పశుపతి, హరికృష్ణన్‌, అన్బుదురై తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  

పార్వతి తిరోవోతు పుట్టినరోజు సందర్భంగా తంగలాన్‌ లో ఆమె నటిస్తున్న గంగమ్మ పాత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మహిళా రైతుగా ఇందులో ఆమె నటిస్తున్నట్టు ఆ లుక్‌ ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింద ని, చియాన్‌ విక్రమ్‌ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలు స్తుందని, ఇందులో ఆయన పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటుందని, కొత్త నేపథ్యంలో, వైవిధ్యమైన కథాంశంతో పా.రంజిత్‌ సినిమా తెరకెక్కిస్తున్నారని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రా నికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events