Namaste NRI

గౌతం అదానీపై అమెరికాలో విచార‌ణ‌… త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌

బిలియ‌నీర్ గౌతం అదానీ , ఆయ‌న కంపెనీల‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు ఇటీవ‌ల అమెరికా స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ముడుపులు చెల్లించిన కేసులో అమెరికా కోర్టు అదానీని నిల‌దీసింది. అయితే భార‌తీయ వ్యాపారిపై అమెరికా న్యాయ‌శాఖ తీసుకున్న నిర్ణ‌యాన్ని రిప‌బ్లిక‌న్ నేత త‌ప్పుప‌ట్టారు. ఎంపిక చేసుకుని ఓ వ్య‌క్తిని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల‌,  భాగ‌స్వామ్య దేశాల‌తో బంధాలు దెబ్బ‌తింటాయ‌ని ఆ నేత పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ మెర్రిక్ బీ గార్లాండ్‌కు లేఖ రాశారు లాన్స్ గూడెన్‌.

విదేశీ వ్యక్తుల‌ను ఎంచుకుని ఎందుకు టార్గెట్ చేస్తున్నార‌ని న్యాయ‌శాఖ‌ను డిమాండ్ చేశారాయన‌. అదానీ విచార‌ణ వెనుక ఏదైనా లోగుట్టు ఉన్నాదా అని, దీని వెనుక జార్జ్ సోర‌స్ లాంటి వ్య‌క్తి ఉన్నారా అని రిప‌బ్లిక‌న్ నేత ప్ర‌శ్నించారు. ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో అమెరికాకు బ‌ల‌మైన భాగ‌స్వామిగా ఇండియా ఉన్న‌ద‌ని, టార్గెట్ చేసి చ‌ర్య‌లు తీసుకోవ‌ డం వ‌ల్ల భాగ‌స్వామ్య కూట‌మి దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. దేశంలోని చెడు వ్య‌క్తుల‌ను ముందుగా అమెరికా న్యాయ‌శాఖ శిక్షించాల‌ని, విదేశీ వ్య‌క్తుల‌ను కాదు అని గూడెన్ పేర్కొన్నారు. వంద‌ల కోట్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెటి, అమెరిక‌న్ల కోసం ల‌క్ష‌లాది ఉద్యోగ అవకాశాలు క‌ల్పిస్తున్న‌వారిని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో అమెరికాకే న‌ష్టం జ‌రుగుతుంద‌ని గూడెన్ త‌న లేఖ‌లో తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress