తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కలిశారు. పార్టీ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆగస్ట్ 16న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ సభలోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పరిచయం చేయనున్నారు.