Skip to main content

Namaste NRI

జర్మనీలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జెన్-జీ నిరసనలు

జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో ముసుగులు ధరించిన కొందరు దుకాణాలను లూటీ చేయడంతోపాటు, పోలీసులతో ఘర్షణకు దిగారు. అత్యవసర సేవల సిబ్బందిపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. బెర్లిన్‌, కొలోన్‌, హాంబర్గ్‌లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకు న్నాయి. జర్మనీ ఆర్థిక కేంద్రంగా పేరొందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనలు రాత్రివేళ హింసాత్మకంగా మారాయి. కనీసం రెండు దుకాణాలను లూటీ చేయగా, మరికొన్ని దుకాణాల అద్దాలను ధ్వంసం చేశారు. దాడులకు గురైన వాటిలో తుపాకుల విక్రయశాల కూడా ఉంది.

షాపింగ్‌ ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు రాళ్లు, బాణసంచా, పెట్రోల్‌ బాంబులతో దాడులకు దిగడంతో పోలీసులు జల ఫిరంగులు, పెప్పర్‌ స్ప్రే ప్రయోగించా రు. ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. హాంబర్గ్‌లో నిరసనకారులు కొన్ని బారికేడ్లకు నిప్పంటించారు. కొలోన్‌లోనూ అత్యవసర సేవల సిబ్బందిపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. బెర్లిన్‌లో మరో నిరసన సందర్భంగా పోలీసులపై గుడ్లు, సీసాలు విసిరినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, పగటిపూట జరిగిన ప్రదర్శనల్లో ఎక్కువభాగం ప్రశాంతంగానే సాగాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events