Namaste NRI

అమ్మాయిలు అర్థం కారు

అల్లం శ్రీకాంత్‌, సాయి దివ్య, ప్రశాంత్‌,  ప్రియాంక  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అమ్మాయిలు అర్థం కారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి,  కర్ర వెంకటసుబయ్య నిర్మిస్తున్నారు.  నరసింహ నంది దర్శకుడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.  తమ్మారెడ్డి భరద్వాజ, బసిరెడ్డి, ప్రసన్నకుమార్‌, మేడికొండ వెంకట మురళీకృష్ణ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మధ్య తరగతి జీవితాన్ని అనుభవించే నాలుగు జంటల ప్రేమ కథ ఇది. వారి జీవితాల్లో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం. కథలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి అన్నారు.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News