టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని 44 కేజీల కేక్ కట్ చేశారు. లీడర్ టైటిల్‌తో కేటీఆర్‌పై రూపొందించిన సీడీని హోంమంత్రి మహమూద్ అలీ, ప్రత్యేక గీతాన్ని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దివ్యాంగుడికి త్రిచక్ర స్యూటీ అందజేశారు.