జపాన్‌లోని కన్సాయ్ వేదికగా నిర్వహించిన 53వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి మధుర్ ఆదర్శ్ రెడ్డి గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకున్నారు. మన దేశం నుంచి నలుగురు విద్యార్థులు పోటీలకు హాజరు కాగా.. 2 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. దక్షిణాదినుంచి ఆదర్శ్‌రెడ్డి ఒక్కరే పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించారు. ఆదర్శ్‌రెడ్డిని నారాయణ విద్యాసంస్థల ఎండీ పీ సింధూర నారాయణ అభినందించారు.