Skip to main content

Namaste NRI

గుడ్ లక్ సఖి వచ్చేస్తోంది

కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన గుడ్‌లక్‌ సఖి ఎట్టకేవలకు విడుదలకు సిద్ధమైంది. కీర్తీ సురేష్‌ కథానాయికగా నటించిన గుడ్‌ లక్‌ సఖి చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టర్‌లో కీర్తి విల్లు ఎక్కు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ క్యూట్‌గా కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. కీర్తి సురేష్‌ షూటర్‌గా నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దిల్‌ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌Ñ సహ నిర్మాత : శ్రావ్య వర్మ.

Social Share Spread Message

Latest News