Skip to main content

Namaste NRI

శుభవార్త.. త్వరలో అమెరికా స్టార్టప్ వీసాలు

అమెరికా త్వరలోనే స్టార్టప్‌ వీసాను ప్రవేశపెట్టనున్నది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు, వారి సృజనాత్మకతకు ద్వారాలు తెరిచేందుకు అమెరికా కంపీట్స్‌ యాక్ట్‌లో భాగంగా ఈ వీసాను తెస్తున్నారు. ఈ చట్టాన్ని అమెరికా కాంగ్రెస్‌లో  ప్రవేశపెట్టారు. అమెరికాలో స్టార్టప్‌లు స్థాపించేవారికి డబ్ల్యూ `1, వారు తెచ్చుకున్న ఉద్యోగులకు డబ్ల్యూ`2 అనే వీసాలు ఇస్తారు. స్థాపించే కంపెనీని బట్టి ఉద్యోగులను ఎంతమందినైనా తెచ్చుకోవచ్చని అంటున్నారు. అయితే వారు  అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో ఏదైనా దేశంలోని తత్సమానమైన సంస్థలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌లో డాక్టోరల్‌ డిగ్రీ చేసి ఉండాలని తెలిపింది.

Social Share Spread Message

Latest News