Skip to main content

Namaste NRI

భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త!

హెచ్‌ `1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తీపి కబురు అందించారు. అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్‌ నుంచి భారతీయ నిపుణులకు హెచ్‌ 1బీ వీసాలు జారీ చేసేందుకు అంగీకరించిందని ఆయన వెల్లడిరచారు. అలాగే ఇతర యూఎస్‌ వీసాల జారీని అగ్రరాజ్యం ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించనుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) స్టూడెంట్‌ వీసాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని  ఈ సందర్భంగా శ్రింగ్లా పేర్కొన్నారు. అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలు ప్రస్తుతం భారత విద్యార్థులకు వీసాలు జారీ చేస్తున్నాయని, ఎంఈఏ ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.

                హెచ్‌` 1బీ అనేది అమెరికన్‌ కంపెనీలకు వివిధ రంగాల్లో నైపుణ్యత గల విదేశీ ఉద్యోగులను నియమింంచుకునేందుకు వీలు కల్పిస్తోంది. దీని ద్వారా భారతీయులే అధికంగా లభ్ది పొందుతున్నారు. అమెరికా ప్రతియేటా 65 వేలు హెచ్‌ 1 బీ వీసాలు జారీ చేస్తోంది.

Social Share Spread Message

Latest News