ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరమితితో బహుళ ప్రవేశ షెన్‌జెన్ వీసా పొందొచ్చు. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను ఐరోపా కమిషన్ సరళీకరిం చింది. భారతీయులకు బహుళ ప్రవేశ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను ఐరోపా కమిషన్ ఆమోదిం చింది. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ప్రామాణిక నిబంధనల కంటే మరింత అనుకూలమైనవి అని ఈయూ తెలిపింది.
కొత్త నిబంధలన ప్రకారం గత మూడు సంవత్సరాల్లో రెండు వీసాలను పొంది, చట్టబద్ధంగా వినియోగించిన భారతీయులకు దీర్ఘకాల, బహుళ ప్రవేశ షెన్‌జెన్ వీసాలను రెండేళ్ల కాలపరమితికి జారీ చేయవచ్చు. సాధార ణంగా ఈ రెండేళ్ల వీసా తర్వాత సంబంధిత ప్రయాణికుడి పాస్‌పోర్ట్‌లో సరిపడినంత చెల్లుబాటు గడువు సమయం ఉన్నట్లైతే ఐదేళ్ల వీసా జారీ చేస్తారు. ఈ వీసాల చెల్లుబాటు సమయంలో సంబంధిత వ్యక్తులు వీసా ప్రీ దేశాల జాతీయులతో సమానంగా ప్రయాణ హక్కులను పొందుతారు అని వివరించింది.