జేమ్స్‌బాండ్ అభిమానులకు శుభవార్త. డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో నటించిన జేమ్స్‌బాండ్ చిత్రం నో టైమ్ టు డై. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మినీ టీజర్‌నూ విడుదల చేసింది. 30 సెకన్ల నిడివిగల ఈ టీజర్‌లో యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. రమీ మాలేక్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. కేరీ జోజి పుకునగ దర్శకత్వం వహించిన చిత్రం యూకేలో సెప్టెంబరు 30నే రానుంది.