Skip to main content

Namaste NRI

మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రేమికుల రోజున సర్కారు వారి పాట

విడుదలకి కొన్ని నెలల ముందు నుంచే సినిమాల పాటలు సందడి చేయడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పాటలు ఎంత బలంగా ప్రేక్షకుల్లోకి వెళితే సినిమాపై అంతగా ఆసక్తి ఏర్పడుతుందని చిత్రవర్గాలు నమ్ముతున్నాయి. అందుకే నెలల ముందే హంగామా మొదలవుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సర్కారువారి పాట చిత్రం నుంచి లవ్‌ సాంగ్‌ రిలీజ్‌ కానుంది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సర్కారువారి పాట. ఇందులో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.  మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లపై చిత్రీకరించిన ఈ మెలోడీ లవ్‌ సాంగ్‌ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తమన్‌ అద్భుతమైన సంగీతం అందించారు అని చిత్రబృందం పేర్కొంది. నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌, రామ్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News