Skip to main content

Namaste NRI

ఎన్నారైలకు గుడ్ న్యూస్

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ప్రవాస భారతీయులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. తమ విదేశీ కరెన్సీ పొదుపును సురక్షితంగా, గరిష్ట లాభాలతో పెంచుకోవడానికి ఇప్పుడు అద్భుతమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) (ఎఫ్ సిఎన్ఆర్(బి) డిపాజిట్లకు మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తీసుకున్న సరికొత్త నిర్ణయంతో, దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎన్నారైలు యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో, ఆస్ట్రేలియన్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలను ఈ ఖాతాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సాధారణ రూపాయి డిపాజిట్లతో పోలిస్తే దీనివల్ల ఉండే అతిపెద్ద లాభం ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఎంత పడిపోయినా సరే, మీ అసలు, వడ్డీ మీరు ఎంచుకున్న విదేశీ కరెన్సీలోనే భద్రంగా ఉంటాయి.

ఇటీవల ఆర్‌బీఐ ఒక కీలక ప్రక్రియను ప్రారంభించింది. 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితి గల కొత్త (ఎఫ్ సిఎన్ఆర్(బి) డిపాజిట్లపై అయ్యే కరెన్సీ హెడ్జింగ్ ఖర్చులను సెప్టెంబర్ 30, 2026 వరకు ఆర్‌బీఐ స్వయంగా భరిస్తుందని ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులకు రిస్క్ తగ్గడంతో, అవి ఎన్నారై ఇన్వెస్టర్లకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయగలుగుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events