తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం సెప్టెంబర్ 8వ తేదీ నుంచి పున ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. రోజుకీ 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వ దర్శనం టోకెన్లు జారీని పరిమితం చేయనున్నట్లు టీటీడీ వెల్లడిరచింంది. కరోనా రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది.