Namaste NRI

యూకే వెళ్లే వారికి శుభవార్త.. 15 రోజుల్లోనే వీసా

భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తొలగించేందుకు యూకే వేగంగా చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత్‌లోని బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌  స్వయంగా వెల్లడిరచారు. వివిధ కారణాల వల్ల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో నెలకొన్న జాప్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తమ ప్రమాణాల ప్రకారం 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడిరచారు. వివిధ కారణాల వల్ల భారత్‌ నుంచి యూకే వీసా దరఖాస్తుల్లో పెరుగుదల కనిపించింది. కొవిడ్‌,  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి కారణాలతో మా వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ నిర్ధారిత 15 రోజులను ఆటేసిదని ఎల్లీస్‌ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాసెసింగ్‌ ప్రక్రియ గాడిన పడిరదని ఎల్లీస్‌ పేర్కొన్నారు. మేము నిపుణుల వర్క్‌, వీసాల ప్రక్రియను వేగంగా ముగిస్తున్నాం అన్నారు.

                 ఇక విజటర్‌ వీసాల ప్రక్రియను కూడా 15 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడంపై దృష్టిపెట్టాం. ఢల్లీి, యూకే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా బృందాలతో కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం. మేము తిరిగి గాడినపడ్డామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను అని ఎల్లీస్‌ పేర్కొన్నారు. వీసాల కోసం కనీసం మూడు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events