Namaste NRI

ఇండియాకు యూఏఈ గుడ్ న్యూస్

చమురు కొరతతో ఇబ్బంది పడుతున్న ఇండియాకు యూఏఈ గుడ్​ న్యూస్ చెప్పింది. ప్రత్యేక మార్గంలో ఇండియాకు చమురు సరఫరా చేయాలని నిర్ణయించింది. చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య అయిన ఒపెక్ నుంచి బయటకు వచ్చిన యూఏఈ నిర్ణయం ఇండియాకు మేలు చేయనుంది. ఇకపై చమురు సరఫరా విషయంలో యూఏఈ స్వతంత్రంగా వ్యవహరించనుంది. దీనిలో భాగంగానే ఇండియాకు భారీ స్తాయిలో, ప్రత్యేక మార్గంలో చమురు సరఫరా చేయాలని నిర్ణయించింది.

చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అంటే, ఇకపై చమురు ఉత్పత్తి, రవాణా, సరఫరా వంటి విషయాలలో ఒపెక్ నిర్ణయాలు, కట్టుబాట్లతో యూఏఈకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ అంశంలో గతంలో సౌదీ అరేబియా రూపొందించిన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉండదు. అందువల్ల చమురు ఉత్పత్తి, రవాణా, వాణిజ్యం వంటి అంశాల్లో యూఏఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. దీనిలో భాగంగానే ఇండియాకు చమురు సరఫరా చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఒపెక్ నుంచి బయటకు రావడం వల్ల యూఏఈ తన సామర్ధ్యానికి తగ్గట్లుగా చమురు ఉత్పత్తి చేస్తుంది.

Social Share Spread Message

Latest News