గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం సింగ. మలయాళ నటి అనార్కలి నాజర్ కథానాయికగా నటిస్తున్నది.ఈ చిత్రం ద్వారా యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ యాభైశాతం పూర్తయింది.

ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ చేతిలో భారీ ఆయుధాన్ని ధరించి శక్తివంతంగా కనిపిస్తున్నారు. అడవి నేపథ్యంలో నడిచే కథాంశమిదని, ప్రత్యేకంగా నిర్మించిన ఫారెస్ట్ సెట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించామని, డిసెంబర్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: సామ్ సీఎస్, రచన-దర్శకత్వం: వి.వెంకట్.















