దుబాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త నిర్వహణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత పట్టాభి పాల్గొన్నారు. వందలమంది తెలుగువారు కలసి ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర హితం కోసం తామందరం ఎన్డీయే కూటమిని బలపరుస్తామని, చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించడంలో తమవంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారని పట్టాభి తెలిపారు.