Skip to main content

Namaste NRI

గ్రాండ్‌గా ఎర్రర 500  ట్రైలర్‌ లాంచ్‌

జస్వంత్‌ పడాల, నక్షత్ర త్రినయని జంటగా ఎన్‌.సాందీప్‌ మైత్రేయ తెరకెక్కించిన చిత్రం ఎర్రర్‌500. యు.బాలరెడ్డి నిర్మించారు. త్రినాథ్‌ శర్మ, రాజీవ్‌ కనకాల, సంజయ్‌ స్వరూప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య, హీరో ఆకాష్‌ పూరి ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ ట్రైలర్‌ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ఎర్రర్‌ 500 అనేది జెస్సీకి యాప్ట్‌ టైటిల్‌. ఈ సినిమా రిలీజ్‌ ప్లాన్‌ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు.  వెంటనే సినిమా సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను అన్నారు.  ఈ సందర్భంగా హీరో జస్వంత్‌ మాట్లాడుతూ ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రం రూపొందించాం. దీనికోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ తప్పకుండా నచ్చుతరుది అన్నారు. జస్వంత్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. ఎంతో అంకిత భావంతో ఈ చిత్రం చేశాడు. ట్రైలర్‌లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో రవి, సోహెల్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events