Skip to main content

Namaste NRI

గుర్తుకొస్తున్నాయి ట్రైలర్‌ లాంచ్‌

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ గుర్తుకొస్తున్నాయి. వినోద్‌ గాలి దర్శకుడు. శరత్‌చంద్ర నాయుడు నిర్మాత. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, సాంగ్‌కి మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ వేడుకకు హీరో సత్యదేవ్‌, అగ్ర దర్శకులు బోయపాటి శ్రీను, కరుణాకరన్‌, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్‌కేఎన్‌, ధీరజ్‌, వంశీ నందిపాటి అతిథులుగా విచ్చేసి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.

ఈ సిరీస్‌కి కథే ప్రధానబలం. ఇందులో నా పాత్ర గతాన్ని మర్చిపోతుంది. ఆద్యంతం భావోద్వేగపూరితంగా దర్శకుడు ఈ సిరీస్‌ని మలిచారు. షూటింగ్‌ టైమ్‌లో నాకు గత జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఎమోషన్స్‌తోపాటు ఫన్నీ సీక్వెన్స్‌, ఎంటర్‌టైనింగ్‌ మూమెంట్స్‌ కూడా ఇందులో ఉంటాయి అని హీరో విరాజ్‌ అశ్విన్‌ చెప్పారు. వెబ్‌సిరీస్‌లకు అవార్డు ఇస్తే, ఈ సిరీస్‌కు తప్పకుండా అవార్డ్‌ వస్తుందని నిర్మాత శరత్‌చంద్రనాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా ఈటీవీ విన్‌ ప్రతినిథులు సాయికృష్ణ కూడా మాట్లాడారు.జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events