తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ బంగారు తెలంగాణ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న మా అన్నయ్య రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా చెల్లి కవిత శుభాకాంక్షలు తెలిపారు. నేను ఎంతో అదృష్టవంతురాలిని, కేటీఆర్ నా అన్న కావడం ఎంతో అదృష్టమని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మా అన్న కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బ్యాలం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి ఫొటోను కవిత పోస్టు చేశారు. మా అన్న రాక్ స్టార్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిగో మీ చిన్నప్పటి చెల్లి అంటూ కవిత దిగన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.