
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంయుక్త కథానాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. హర్షాలీ మల్హోత్రా అఖండ-2 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నది. ఈ సినిమాలో ఆమె జనని అనే కీలక పాత్రలో కనిపిస్తుందని చిత్రబృందం తెలిపింది.హర్షాలీ మెహతా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణ సంస్థ: 14రీల్స్ ప్లస్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
















