Skip to main content

Namaste NRI

రీసెన్సార్‌ను పూర్తి చేసుకున్న హిడింబ

అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటిస్తున్న చిత్రం హిడింబ. అనిల్‌ కన్నెగంటి దర్శకుడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకంపై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్‌ సన్నివేశాలపై సెన్సార్‌ వాళ్లు అభ్యంతరం తెలపడంతో ఇటీవల రివ్యూ కమిటీ ద్వారా చిత్రం రీసెన్సార్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇండియన్‌ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, టచ్‌ చేయని జానర్‌తో రూపొందిన సినిమా ఇది.యూనిక్‌ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ల్‌ని ఇచ్చే విధంగా దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: అనిల్‌ సుంకర.

Social Share Spread Message

Latest News