Namaste NRI

అస్సాం ముఖ్యమంత్రిగా మరోసారి హిమంత బిశ్వశర్మ ప్రమాణం

ఈశాన్య భారతంలో అత్యంత కీలకమైన రాష్ట్రమైన అస్సాం లో మూడవసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండవ సారి భాద్యతలు చేపట్టారు. గౌహతిలో మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ హిమంత బిశ్వశర్మ తో ప్రమాణం చేయించారు. తరువాత నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని మోది , కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివ రాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు, బిజెపి అధ్యక్షుడు నితిన్ నాబిన్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హిమంత ప్రమాణ స్వీకారంకు సుమారు లక్ష మంది ఎన్డీయే మద్దతుదారులు తరలివచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events