Namaste NRI

ఆయన రాకపోవడం నిరాశ కలిగించింది: జో బైడెన్

ఈ వారం భారత్ పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, కానీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూఢిల్లీ లోని జి20 సదస్సుకు రావడం లేదని తెలిసి నిరాశ పరిచిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. జి20 సదస్సుకోసం బైడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. చారిత్రాత్మకమైన సమావేశంపై సెప్టెంబర్ 8న భారత ప్రధాని మోడీతో భేటీ అవుతారు. భారత్ పర్యటనకు ముందుగా విలేఖరులు బైడెన్‌ను భారత్, వియత్నాం పర్యటనల గురించి అడిగారు. జిన్‌పింగ్ రాకపోవడం నిరాశ కలిగించిందని, కానీ ఆయనను కలుసుకోడానికి తాను వెళ్తానని బైడెన్ పేర్కొన్నారు. కానీ వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం బైడెన్ వెల్లడించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events