Namaste NRI

చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది : మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ హీరోలుగా నటించిన మెగా మల్టీ స్టారర్ మూవీ వాల్తేరు వీరయ్య. కే.ఎస్. రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించగా, క్యాథరీన్ థెరిస్సా కీలక పాత్రలో నటించారు. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మెగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మెగాస్టార్ వింటేజ్ లుక్, డైలాగ్స్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్.. ఇలా అన్నీ అంశాలు అభిమానులనే సగటు సినీ ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టాడు వాల్తేరు వీరయ్య. కాగా ఈ మెగా మల్టీ స్టారర్ మూవీ పలు థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ హైదరాబాద్లో ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీతో పాటు హరీష్ శంకర్, ఉప్పెన బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు ఈ ఫంక్షన్లో సందడి చేశారు. ఈ సందర్భంగా వేడుకను ఉద్దేశించిన చిరంజీవి మాట్లాడుతూ   రెండు వందల రోజులు సినిమా ఆడి, విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరు కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్యకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో రవితేజ, దర్శకులు బాబీ, హరీశ్‌ శంకర్‌, బుచ్చిబాబు, గోపీచంద్‌ మలినేని, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events