Skip to main content

Namaste NRI

రిపబ్లిక్ డే కానుకగా హంట్ విడుదల

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా హంట్. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఈ  సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుధీర్ లుక్  కళ్ళలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే, భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ మా హంట్  సినిమాను చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి.  సినిమా రెడీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం.  రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నాం  అన్నారు.  రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ హంట్  లో స్టంట్స్ కంపోజ్ చేశారు. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, పాపతో పైలం  పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events