Skip to main content

Namaste NRI

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై దాడి

అమెరికాలోని యుటా రాష్ట్రంలో హైదరాబాద్‌లోని టోలీచౌకికి చెందిన సోహైల్‌ ఉద్దీన్‌(38)పై ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన సోహైల్‌, భార్య, ఇద్దరు పిల్లలతో రెండేళ్లుగా యుటా రాష్ట్రంలోని సాల్ట్‌లేక్‌ కౌంటీలో నివాసముంటున్నారు. వెస్ట్‌వ్యాలీ సిటీలోని ఓ మాల్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 14న విధుల్లో ఉన్న సమయంలో మాల్‌కు వచ్చిన ఓ దుండగుడు నువ్వు ఇండియన్‌వే కదా అంటూ విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు సోహైల్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశారు. టోలిచౌకిలోని సోహైల్‌ ఇంట్లో అతని తల్లి మాత్రమే ఉంటున్నారు. ఈ ఘటనపై అధికారులు, బాధితుడి కుటుంబీకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత కాన్సులేట్‌ పేర్కొంది.

Social Share Spread Message

Latest News