
ప్రపంచంలోని 75 దేశాల దరఖాస్తుదారులకు సంబంధించిన గ్రీన్‌కార్డు ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని భారత సంతతికి చెందిన వాషింగ్టన్ డీసీ ఫెడరల్ జిల్లా కోర్టు జడ్జి అమిత్ మెహతా తీర్పు చెప్పారు. నిర్దిష్ట కాన్సులర్ అధికారుల నుంచి నిర్ణయాధికారాలను తొలగించడం ద్వారా అమెరికా విదేశాంగ శాఖ తన చట్టపరమైన పరిధిని అతిక్రమించిందని పేర్కొన్నారు. విదేశీ కార్మికుల హెచ్-1బీ వీసాలు, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం విదేశీ కార్మికులను స్పాన్సరింగ్ చేసే ఖర్చును పెంచేందుకు అమెరికా కార్మిక శాఖ యోచిస్తున్న క్రమంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.





























