Skip to main content

Namaste NRI

అమెరికా పౌరసత్వం వద్దు .. మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది

ఆంధప్రదేశ్‌ బాపట్లకు చెందిన 94 ఏండ్ల వృద్ధురాలు మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకొని, తిరిగి భారత పౌరసత్వం పొందాలని కోరుకుంటున్నది. గత వారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ను కలుసుకొని, తనకు భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. జీవితం చరమాంకంలో ఉన్న తనకు సొంత గడ్డపై తుదిశ్వాస విడిచిపెట్టే అవకాశం కల్పించాలని కోరటం, కలెక్టర్‌, అక్కడున్న ఇతర అధికారులను కదలించింది. ఆమె కుమారుడు అమెరికాలో పెద్ద డాక్టర్‌. తల్లిని అమెరికాకు తీసుకుపోవటంతో 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది.

Social Share Spread Message

Latest News