Namaste NRI

ఇప్పుడు ఎన్నికలు జరిగితే…  రిషి సునాక్‌కే బ్రిటన్‌ పగ్గాలు

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని లిజ్‌ ట్రస్‌పై భారత సంతతి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ విజయం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా నిర్వహించిన గ్యాలప్‌ పోల్‌లో అధికార  కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో  కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55 శాతం మంది మొగ్గు చూపారు. లిజ్‌ ట్రస్‌ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుండగా, కొనసాగాలని 38 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News