Namaste NRI

నేను అధ్యక్షుడినైతే.. ట్రంప్‌ను

 అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయ‌న పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున తానే  బరిలో దిగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిగా నామినేట్‌ అయితే ఆయనకు మద్దతిస్తానని స్పష్టం చేశారు.

అదేవిధంగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రస్తుతం అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ట్రంప్‌ను  క్షమిస్తానని ప్రకటించారు.వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిగా నామినేట్‌ అయితే నేను అతనికి  మద్దతు ఇస్తాను. నేను అధ్యక్షుడిని అయితే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను క్షమిస్తాను.  ఎందుకంటే అది దేశం మళ్లీ ఏకం కావడానికి సహాయపడుతుంది. తదుపరి దేశాధ్యక్షుడిగా నేను చేయబోయే  అతి ముఖ్యమైన విషయం ఇది కాకపోవచ్చు. కానీ, ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరం అని  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events