Skip to main content

Namaste NRI

దూకుడుగా వ్యవహరిస్తే మళ్లీ దాడులు తప్పవు.. ట్రంప్ హెచ్చరిక

అమెరికాతో చర్చల అంశంపై ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనలనకు సమీక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో తాను యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని చెప్పాడు. ఇరాన్ తాజాగా చేసిన ప్రతిపాదనలపై సమీక్షిస్తున్నట్లు, అయితే, వాటిని అంగీకరిస్తానో లేదో తెలియదన్నారు. అయినప్పటికీ ఇరాన్‌పై సైనిక చర్యకు ఇంకా అవకాశాలున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే, 47 ఏళ్లుగా ప్రపంచానికి, మానవజాతికి ఇరాన్ చేసిన దానికి ఆ దేశం ఇంకా పరిహారం చెల్లించుకోలేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినా, తప్పుగా ప్రవర్తించినా మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తాజాగా అమెరికాకు ఇరాన్ 14 అంశాలతో నూతన ప్రతిపాదనలు పంపింది. పాకిస్తాన్ ద్వారా తమ సమాచారాన్ని చేరవేసింది. ఈ అంశంలో నిర్ణయం అమెరికా చేతిలోనే ఉందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే, తమ సైన్యం ఎలాంటి చర్యకైనా సిద్ధంగానే ఉందని వెల్లడించింది.

Social Share Spread Message

Latest News