Skip to main content

Namaste NRI

ఆకాశం దాటి వస్తావా ఆకట్టుకుంటోన్న టీజర్

కొరియోగ్రాఫర్‌ యష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఆకాశం దాటి వస్తావా. శశికుమార్‌ దర్శకుడు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. కార్తీక మురళీధరన్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ఎన్ని సార్లు వస్తావ్ ఇలా? అని హీరోయిన్ అనడం..ఎన్ని సార్లైనా వస్తాను అని హీరో అనడం.. ఎంత దూరమైనా వస్తావా? అని హీరోయిన్.. అడిగి చూడు అని హీరో.. అబ్బో అడినంత మాత్రానా సముద్రాలు దాటి ఆకాశం దాటి వస్తావా? అంటూ హీరోయిన్ సంభాషణలతో టీజర్ సాగింది.  ప్రేమికుల మధ్య సరదా సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఓ జంట ప్రేమ పయనంలోని జ్ఞాపకాలకు అద్దం పడుతుంది. చక్కటి వినోదంతో మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ర్యాంపీ నందిగాం, సంగీతం: కార్తీక్‌.

Social Share Spread Message

Latest News