Skip to main content

Namaste NRI

అమెరికాపై ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు 

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అగ్రరాజ్యం అమెరికాపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్‌ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ జాతినుద్దేశించి మాట్లాడారు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక అమెరికా ఉందని మండిపడ్డారు. తాను ఒక పప్పెట్‌లా ఉండాలని అమెరికా భావించిందని ఆరోపించారు. తనను తోలుబొమ్మను చేసి ఆడిరచాలనుకుందని వ్యాఖ్యానించారు. రష్యాలో తాను పర్యటించడం అమెరికాకు నచ్చలేదన్నారు. తన రష్యా పర్యటన అమెరికా ఇష్టం లేదన్నారు.

Social Share Spread Message

Latest News