Skip to main content

Namaste NRI

న్యూయార్క్ సిటీలో… మున్సిపల్ సిబ్బందికి షాక్

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలోని మున్సిపల్‌ సిబ్బబందికి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వ్యాక్సిన్‌ వేసుకోని సుమారు మూడు వేల మంది వర్కర్లను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డెడ్‌లైన్‌ లోపు కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ తీసుకోవాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ కార్మికులంతా టీకాలు వేసుకోవాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. న్యూయార్క్‌ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, టీచర్లు కనీసం ఒక్క  డోసు టీకా తీసుకుని ఉండాలని గత ఏడాది ఆ నగర మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు.  ప్రస్తుతం కరోనా ఆంక్షలను క్రమక్రమంగా ఎత్తివేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ నియమావళిని కూడా ఎత్తివేశారు.

Social Share Spread Message

Latest News