Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ విషయంలో… జో బైడెన్ మరో కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సేనల బీకర దాడులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. అయుధాలు సరఫరా చేస్తామని వెల్లడిరచారు. అలాగే శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. కీవ్‌కు ఆర్థిక, ఆహారంతో పాటు ఇతర మానవతా సాయం చేస్తామని తెలిపారు. దాడులు చేస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్‌ వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేవా నిర్థారించుకుంటాం. ఉక్రెయిన్‌ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం, మానవతా సహాయాన్ని పంపుతాం. ఉక్రెయిన్‌ శరణార్థులను స్వాగతిస్తాం అని బైడెన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని పిరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మిత్రదేశాలు, భాగస్వాములతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News