భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఓవల్ స్టేడియంలో 1971 తర్వాత ఇంగ్లండ్‌ను ఓడిరచి తొలి టెస్ట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో ఆధిక్యంలో దూసుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని చేధించే అతిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనుర్లు హసీబ్ హమీద్, రోరీ బర్న్స్ అర్థ శతకాలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ జోరూట్ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా నిలవలేకపోయాడు. ఇక భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీస పోరాటం చేయకుండా పెవిలియన్ చేరడంతో భారత్ అద్భుత విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 పరుగులే చేసి కుప్పకూలిపోయింది.