Skip to main content

Namaste NRI

అమెరికాను అధిగమించిన భారత్‌

భారత్‌లో జనాభా అధికంగా ఉన్నా అభివృద్ధి విషయంలో అమెరికా తర్వాతే భారత్‌ ఉంటుంది. కానీ ఓ విషయంలో భారత్‌ అమెరికాను అధిగమించింది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా ఇండియా నిలిచింది. పని  వాతావరణం, వ్యయ పోటీతత్వం కారణంగా భారతదేశం ఈ స్థానాన్ని సాధించింది. ఇదేకాకుండా భారతదేశం ఔట్‌సోర్సింగ్‌ అవసరాలను కూడా నెరవేర్చింది. ఈ విభాగంలో కూడా ర్యాంకింగ్‌ మెరుగుపడిరది. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా చైనా ఉన్నది. ఒక స్థానం ఎగబాకి, రెండో స్థానానికి భారతదేశం హస్తగతం చేసుకుంది.

                గత ఏడాది అమెరికా రెండవ స్థానంలో, భారతదేశం మూడో స్థానంలో ఉన్నాయి. యూరప్‌, అమెరికా, ఆసియా పసిఫిక్‌లోని 47 దేశాల్లో తయారీకి ఆకర్షణీయమైన ప్రదేశాలను గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ రిస్క్‌ ఇండెక్న్‌ అంచనా వేస్తుంది.  ఈ నివేదిక ప్రకారం అమెరికాకు 3వ స్థానం, కెనడా 4, చెక్‌ రిపబ్లిక్‌ 5వ, ఇండోనేషియా ఆరవ, లిథువేనియా ఏడో,  థాయ్‌ల్యాండ్‌ 8వ, మలేషియా 9వ, పోలాండ్‌ 10వ స్థానంలో ఉన్నాయి. అమెరికా, ఆసియా`పసిఫిక్‌ ప్రాంతాలతో పోలిస్తే చాలా మంది తయారీదారులు భారతదేశంలో తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

                భారతదేశంలో తయారీ రంగంలో మొత్తం కంపెనీల్లో తయారీ కంపెనీల వాటా 20 శాతంగా ఉన్నది. అయితే జూలై నెలలో వీరి వాటా 21 శాతానికి పెరిగింది. గత నెలలో దేశంలో మొత్తం 15,499 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో 21 శాతం అంటే 3,217 కంపెనీలు తయారీకి సంబంధించినవే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News